
గుండెపోటుతో వ్యక్తి మృతి
వెల్గటూర్: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ (37) గురువారం ఉదయం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లగా హఠాత్తుగా గుండెలో నొప్పి వచ్చింది. తల తిరుగుతోందని చెప్పడంతో స్నేహితులు స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన కరీంనగర్ తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య తిరుమల, ఇద్దరు ఎనిమిదేళ్ల లోపు వయసున్న కూతుళ్లు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో..
కాల్వుశ్రీరాంపూర్(పెద్దపల్లి): కూనారం గ్రామంలో పులిపాక సంపత్(32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంపత్ తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించడంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే తాడుతీసి కాల్వశ్రీరాపూర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిఉన్నాడని నిర్ధారించారు. మృతుడు సంపత్ స్వగ్రామం కమాన్‌పూర్ మండలం రొంపికుంట కాగా కనారం గ్రామానికి చెంది దొడ్ల రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొంతకాలంగా కూనారంలో నివాసం ఉంటున్నాడు. అతడి మృతి అనుమానాస్పదంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.
మూర్చతో యువకుడు..
● పొలం వద్ద కిందపడి అక్కడికక్కడే మృతి
● వెంకటాపూర్‌లో విషాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుంటుక శ్రీకాంత్ (25) అనే యువకుడు మూర్చవ్యాధితో గురువారం మృతిచెందాడు. వెంకటాపూర్‌కు చెందిన పిట్టల కనకయ్య దగ్గర శ్రీకాంత్ కొంతకాలంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ యజమాని కనకయ్యతో కలిసి పొలం వద్దకు వెళ్లిన శ్రీకాంత్ అక్కడే మూర్చ రావడంతో కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పుడప్పుడు శ్రీకాంత్‌కు మూడ్చవ్యాధి వస్తుండేదని గ్రామస్తులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
బోయినపల్లి: మండలంలోని కొదురుపాక బ్రిడ్జి పరిసరాల్లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌కు చెందిన అంబేటి వెంకటాద్రి (55) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..వెంకటాద్రి కరీంనగర్ నుంచి వేములవాడ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. బ్రిడ్జి పరిసరాల్లో మృతిచెంది ఉండగా వెంకటాద్రిని ఏదైనా వాహనం ఢీ కొట్టి చనిపోయాడా ? లేదా బైక్ అదుపుతప్పి కిందపడి మృతిచెందాడా అనే విషయం తెలియరాలేదు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని ఎస్సై రాజకుమార్ పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా వెంకటాద్రి వంట మాస్టర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందేవాడని తెలిసింది.
వ్యభిచార ముఠా పట్టివేత
జగిత్యాలక్రైం: పట్టణ శివారులోని పద్మనాయక కల్యాణ మండపం వెనక ప్రాంతంలో రహస్యంగా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సీసీఎస్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ఇద్దరు మహిళలతోపాటు ఇద్దరు విటులను పట్టుకొని పట్టణ పోలీసులకు అప్పగించారు.

గుండెపోటుతో వ్యక్తి మృతి