
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిచేసిన వ్యక్తిపై కేసు
మల్యాల: స్టేజీపై కాకుండా దూరంగా బస్సు ఆపడంటూ డ్రైవర్‌ను తిడుతూ.. దాడి చేసిన ద్విచక్ర వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు మల్యాల ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. పెగడపల్లి నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ రవీందర్ మండలంలోని లంబాడిపల్లి స్టేజీపై కాకుండా కాస్త దూరంగా ఆపాడు. ప్రయాణికులను దింపి సమీపంలో ఉన్న ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. అయితే స్టేజీపై లంబాడిపల్లికి చెందిన ఎనుగందుల దిలీప్ బస్సు కోసం పరుగెత్తినా డ్రైవర్ ఆపలేదు. దీంతో దిలీప్ బైక్‌పై వచ్చి మల్యాల స్టేజీ వద్ద బస్సుకు అడ్డంగా నిలిపి, బస్సు ఎందుకు ఆపడం లేదంటూ డ్రైవర్ రవీందర్‌ను బూతులు తిడుతూ దాడి చేశాడు. బస్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు దిలీప్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రెండిళ్లలో చోరీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని వేణుగోపాల్‌పూర్‌లో రెండిళ్లలో సోమవారం చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామంలోని సామ అంజవ్వ, సింగిరెడ్డి కవిత ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతననానికి పాల్పడ్డారు. కవిత ఇంట్లో రూ.లక్ష, రెండు బంగారు ఉంగరాలు, 20 తులాల పట్టగొలుసులు ఎత్తుకెళ్లారు. అంజవ్వ ఇంట్లో ఏమి చోరీకి గురికాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.