
మరుపురాని ‘కోట’ జ్ఞాపకం
● మధ్యంతర ఎన్నికలలో సాగర్‌జీతో కోట శ్రీనివాస్‌రావు ప్రచారం
చందుర్తి(వేములవాడ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న సమయం. 2009లో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు గెలువగా, 2010లో పదవికి రాజీనామా చేశారు. దీంతో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేంద్ర మాజీ హోంశాఖ సహాయమంత్రి చెన్నమనేని సాగర్‌రావు వేములవాడ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నమనేని సాగర్‌రావు తరఫున సినీనటుడు కోట శ్రీనివాస్‌రావు 2010లో రుద్రంగిలో ప్రచారానికి వచ్చారు. కోట శ్రీనివాస్‌రావు మరణవార్త విన్న రుద్రంగివాసులు, బీజేపీ శ్రేణులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. బీజేపీ నాయకుడు పడాల గణేశ్ ఆధ్వర్యంలో కోట శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో కోటకు నివాళి అర్పించారు.