
రేపటి నుంచి ఆల్ ఇండియా చెస్ టోర్నీ
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా జీనీయస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో 3వ ఆల్ ఇండియా చెస్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్, కోచ్ కంకటి అనూప్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పోటీల వివరాలు వెల్లడించారు. ఈ నెల 12,13 తేదీల్లో కరీంనగర్‌లోని వీ కన్వెన్సన్‌లో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఉచిత వసతి భోజన, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు పోటీలను స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు సుమారు రూ.లక్షకు పైగా నగదు బహుమతులతో పాటు ట్రోపీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జీనీయస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనుకయ్య, కో ఆర్డినేటర్లు సృజన్‌కుమార్, సతీశ్ బాబు, పెటా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శ్రీధర్‌గౌడ్, దారం శ్రీనివాస్‌రెడ్డి, శివకృష్ణ, మైపాల్, రమ్య పాల్గొన్నారు.
హాజరుకానున్న
1000 మంది క్రీడాకారులు
జీనీయస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్