
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
● ఇందిరమ్మ ఇండ్ల ఇసుక పక్కదారి ● 13 ట్రాక్టర్లపై కేసు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని మానేరువాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలించడానికి వాగులోకి దిగిన ట్రాక్టర్లపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఇందిరమ్మ ఇండ్లకు వెంకటాపూర్ నుంచి ఇసుకను తరలించడానికి 33 ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చారు. అయితే ఉదయం 7 గంటలకే 13 ట్రాక్టర్లను వాగులోకి తీసుకెళ్లి ఇసుకను నింపుతుండగా.. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పోలీసుల సహకారంతో ట్రాక్టర్‌లను సీజ్ చేశా రు. అధికారుల రాకను ముందే తెలుసుకున్న కొంద రు ట్రాక్టర్లతోపాటు పరారయ్యారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ ఇసుకను పక్కదారి పట్టించడానికి ట్రాక్టర్ల యాజమానులు సమ యం కంటే ముందే వాగులోకి దిగడంతో పట్టుకున్నామన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్ప డితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.