అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Jul 4 2025 3:44 AM | Updated on Jul 4 2025 3:44 AM

అభివృ

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

● నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో కొనసాగుతున్న స్మార్ట్‌ సిటీ పనులను త్వరగా పూర్తిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. గురువారం ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో చేపట్టిన 34 ప్రాజెక్టుల పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిజిటల్‌ లైబ్రరీ భవనం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం, బాలసదన్‌ భవనంతో పాటు ఇతర పనులను వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన ప్రాజెక్టుల్లో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఈఈలు యాదగిరి, సంజీవ్‌ కుమార్‌, డీఈలు లచ్చిరెడ్డి, ఓంప్రకాశ్‌, అయ్యూబ్‌ ఖాన్‌, ఏఈలు సతీశ్‌, గట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్‌ సిటీ అక్రమాలపై విచారణ జరిపించాలి

సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌కార్పొరేషన్‌: నగరంలో స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనుల పేరిట గత పాలకులు పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపించాలని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ పమేలా సత్పతిని కలిసి వినతిపత్రం అందజేశారు. అంచనాలు పెంచి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని, చేసిన పనుల్లోనూ నాణ్యత లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఎండీ తాజ్‌, కట్ల సతీశ్‌, చర్ల పద్మ, కొరివి అరుణ్‌కుమార్‌, శ్రవణ్‌నాయక్‌, దన్నాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎప్‌సెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలల్లో ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాల కోసం గురువారం స్లాట్‌ బుక్‌ చేసుకున్న 626 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డి.శోభారాణి తెలిపారు. మూడో రోజు ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ సజావుగా సాగినట్లు ఆమె వివరించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, బహిరంగ మద్యసేవనంపై ఉన్న నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌస్‌ఆలం ప్రకటించారు. దీంతో పాటు డీజేలపై, డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత ఏసీ పీల నుంచి అనుమతి లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడని సూచించారు.

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

కరీంనగర్‌: పెండింగ్‌లో ఉన్న ఫీజుబకాయిలు, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలని జార్జ్‌రెడ్డి పీడీఎస్‌యూ జిల్లాశాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన డిగ్రీ, ఇంజినీరింగ్‌, ప్రొఫెషనల్‌ కోర్సు విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైందని జిల్లా అధ్యక్షుడు రత్నం రమేశ్‌ తెలిపారు. నాలుగేళ్ల నుంచి విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రూ.8వేల కోట్ల ఫీజుబకాయిలు పెండింగ్‌లో ఉంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థులు పైచదువులకు వెళ్లాలంటే వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా యా జమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు నరేశ్‌, రత్న, ప్రకాశ్‌, రవీందర్‌, నాగరాజు, సు ధాకర్‌, సందీప్‌, రాకేశ్‌, శ్రీమాన్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు   వేగవంతం చేయాలి1
1/3

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు   వేగవంతం చేయాలి2
2/3

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు   వేగవంతం చేయాలి3
3/3

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement