‘విద్యావాహిని’తో ప్రచార బాట
ప్రచార రథంతో ప్రచారం నిర్వహిస్తున్న
ఎంఈవో ప్రభాకర్‌రావు, ఉపాధ్యాయులు
కరీంనగర్: ‘మా బడిలో మంచి తరగతి గదులున్నాయి. ప్రయోగాలు చేసేందుకు సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి పౌష్టికాహారం అందిస్తున్నాం. మీ పిల్లలను మా బడిలో చేర్పించండి’ అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర ఎంఈవో ప్రభాకర్‌రావు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. బడిబాటకు ముందు సొంతంగా విద్యావాహిని పేరిట ప్రచారం రథం ఏర్పాటు చేసి, ఆ వాహనానికి బడిలో కల్పిస్తున్న వసతుల ఫొటోలు అంటించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులను వెంటేసుకుని రోజుకో గ్రామం తిరుగుతూ బడిబాటను కొనసాగిస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రభాకర్‌రావు తెలిపారు. కలెక్టర్‌పమేలా సత్పతి స్ఫూర్తితో సొంత ఖర్చులతో వాహనం సమకూర్చి బడిబాటలో భాగంగా ప్రచార జాత నిర్వహిస్తున్నారు. ప్రభాకర్‌రావు గతంలోనూ జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. ప్రత్యేక ప్రచార జాత నిర్వహిన్న ఎంఈవోను ఇటీవలే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సత్కరించారు. ప్రభాకర్‌రావును స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపాధ్యాయ లోకానికి పిలుపునిచ్చారు.


