‘బడిబాట’ను విజయవంతం చేయాలి
● పాఠశాల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు, ఉచిత దుస్తులు ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: బడిబాట కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఈనెల 12వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకా రం ప్రతిరోజు బడిబాట కార్యక్రమంలోని అంశాలను పాటించాలన్నారు. బాల బాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో, ఆరేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించేలా చూడాలన్నారు. అంగన్‌వాడీల్లో కొత్త సిలబస్ ప్రకారం శిక్షణ పొందిన టీచర్ల ఆధ్వర్యంలో ప్లేస్కూల్ మెటీరియల్, యూనిఫామ్, పోషకాహారం అందజేస్తున్నామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాలల్లోని సౌకర్యాల గురించి ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్ ప్రదర్శన, కరపత్రాల పంపిణీ ద్వారా డోర్‌టుడోర్ అవగాహన కల్పించాలన్నారు. ఈ సంవత్సరం యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, వర్క్‌బుక్స్ పాఠశాల ప్రారంభం రోజు ప్రతీ విద్యార్థికి అందించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, డీఈవో మొండయ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్‌రెడ్డి ఆంజనేయులు పాల్గొన్నారు.
‘శుక్రవారం సభ’ భేష్
జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభ అభినందనీయం అని, కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పంచాయతీరాజ్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై హైదరాబాద్‌లో ఈనెల 4,5న ‘మేధో మథన సదస్స్ఙు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అమలు చేస్తున్న ‘శుక్రవారం సభ’ గురించి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి వివరించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ కార్యక్రమాన్ని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌ని సత్కరించారు.


