
ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి
గోదావరిఖని: ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గదర్శి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక భాస్కర్‌రావుభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ నేతలను ఎన్‌కౌంటర్ పేరిట చంపుతూ పైచాచిక ఆనందం పొందుతోందన్నారు. మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతామని ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా.. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికై నా ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి శాంతిచర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆపరేషన్ కగార్‌ను చేపట్టిందని ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్‌లో చండీగఢ్‌లో, తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టులో మేడ్చల్ జిల్లాలో జరుగన్నాయని తెలిపారు. ఈలోగా పట్టణ, మండల, జిల్లా మహాసభలు పూర్తి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శంకరన్న, తాండ్ర సదానందం, గోసిక మోహన్, గోవర్ధన్, కె.కనకరాజ్, తాళ్లపెల్లి మల్లయ్య, కొడం స్వామి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్‌రెడ్డి