కొత్తపల్లి: కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ పాఠశాలలో గురువారం రాత్రి నిర్వహించిన వార్షి కోత్సవ వేడుకలు విద్యార్థుల్లో జోష్‌ను నింపాయి. పాఠశాల ఆవరణలో గురువారం రాత్రి అల్ఫోర్స్ ‘బ్లింక్’ పేరుతో నిర్వహించిన వేడుకలను అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డితో కలిసి శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతిభపాటవ పోటీలు, పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.