కొత్తపల్లి: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తే విజయం సొంతం చేసుకోవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో శ్రీఫ్లోరెంట్‌శ్రీ పేరిట నిర్వహించిన పాఠశాల వార్షిక వేడుకలను బుధవారం రాత్రి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డితో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలు, ప్రతిభా పాటవ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అల్ఫోర్స్ ‘ఫ్లోరెంట్’ వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి
క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి