గోదావరిఖని: సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా కంపెనీ వైద్యాధికారే కొనసాగుతారని ఆ సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులుతో జరిగిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. సింగరేణి వైద్యాధికారులు ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావద్దని సూచించారు. వైద్య సేవలను కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఆకాంక్షను సాకారం చేసేక్రమంలో విలువైన సలహాలు, సూచనలు అందించే బాధ్యతలను మాత్రమే చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (సీఎంఎస్)గా నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్పొరేట్ తరహా వైద్యాన్ని అన్ని ఏరియాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సీఎంఎస్ కృషి చేస్తారని ఆయన వివరించారు.
సింగరేణి సీఎండీ బలరాం