కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ పద్మ అన్నారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రాభవన్‌లో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా కార్మికుల సదస్సులో మాట్లాడారు. ఉపాధి చట్టం ప్రకారం పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుశీల, మాతంగి మానస, విజయలక్ష్మి, సరిత, వజ్రమ్మ, లక్ష్మి, అంజలి పాల్గొన్నారు.
కాలువ నీటి కోసం ఆందోళన
కరీంనగర్‌రూరల్: ఎస్సారెస్పీ కాలువ నీటిని వి డుదల చేయాలని సోమవారం పలువురు రై తులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. 11ఆర్ ఉపకాలువ పరిధికి వచ్చే చామనపల్లి, తాహెర్‌కొండాపూర్, ఐతరాజ్‌పల్లె గ్రా మాల రైతులు కాలువ నీటి కోసం వెదురుగట్ట శివారులోని డీ86 ప్రధాన కాలువ దగ్గరికి వెళ్లా రు. 11ఆర్ ఉపకాలువలోకి నీళ్లు వచ్చేందుకు వీలుగా ప్రధాన కాలువ తూము షట్టర్ పైకి లే పేందుకు రైతులు ప్రయత్నించగా జూలపల్లి పోలీసులు అడ్డుకున్నారు. నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు రైతులు బలవంతంగా కొంతమేరకు షట్టర్ ఎత్తడంతో ఉపకాలువలోకి నీళ్లు రావడంతో వివాదం సద్దుమణిగింది.అయితే మళ్లీ రాత్రి అధికారులు షట్టర్ మూసివేయడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలు నెరవేర్చాలి