మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
తోటకూర ఎంతమ్మా..
పాపం..పండుటాకులు!
విద్యార్థులు చదువుతోపాటు వ్యాపారరంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పండించిన కూరగాయలతో సోమవారం కరీంనగర్ కశ్మీర్‌గడ్డ రైతుబజార్‌లో విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్‌ను ప్రారంభించారు. కూరగాయల విక్రయాలపై అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. డీఈవో జనార్దన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి, కోఆర్డినేటర్స్ అశోక్‌రెడ్డి, శ్రీనివాస్, జన్య ఫౌండేషన్ ఆపరేషన్ మేనేజర్ సురేందర్ పాల్గొన్నారు. – కరీంనగర్
న్యూస్‌రీల్