
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అప్పుల బాధతో ఓ గొర్రెల కాపరి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తుల వివరాల ప్రకారం.. రాగట్లపల్లికి చెందిన నెత్తెట్ల చిన్న మల్లయ్య(48) ఇల్లు నిర్మించుకునేందుకు, భూమిని అభివృద్ధి చేయడం కోసం సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుండటంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య సత్తవ్వ, కుమారుడు అజయ్, కూతురు అమ్ములు ఉన్నారు. మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ దాసరి సుజాత, గ్రామస్తులు కోరారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మల్లయ్య (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment