
మాట్లాడుతున్న మహేశ్
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పాలనా యంత్రాంగం సహకారంతో అక్టోబర్ 8న కేబుల్ బ్రిడ్జి నుంచి కరీంనగర్ మారథాన్ నిర్వహిస్తున్నట్లు మారథాన్ కమిటీ అధ్యక్షుడు పసుల మహేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజల్లో ప్రేరణ కలిగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మారథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారథాన్‌లో భాగంగా 3కిలోమీటర్లు, 5కిలోమీటర్లు, 10కిలోమీటర్లు, 21కిలోమీటర్ల కేటగిరీలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన వారు మారథాన్ లింకు ద్వారా ఈ నెల 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసకోవాలన్నారు. అక్టోబర్ 7వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులకు వీకన్వెన్షన్ హాల్లో టీషర్టులు, రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు గంప వెంకట్, డాక్టర్ కిరణ్‌రెడ్డి, డాక్టర్ ఉషాఖండల్, స్వప్న, రవీందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా యువజన క్రీడాధికారి కీర్తి రాజవీరు, తదితరులు పాల్గొన్నారు.