● గంటలో సమస్యలకు పరిష్కారం
సమస్య దృష్టికి రావడమే ఆలస్యం...నగరపాలక సంస్థ కమిషన్ ప్రఫుల్ దేశాయ్ స్పందించిన తీరు నగరవాసుల ప్రశంసలు అందుకుంది. ‘సాక్షి ఫోన్ ఇన్’లో స్థానికులు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను గంటల్లో పరిష్కరించి కమిషనర్ శెహబాస్ అనిపించుకున్నారు. 40వ డివిజన్ వివేకనందపురికాలనీలో రోడ్డుపై పడవేసిన చెట్లు, చెట్టు కొమ్మలను సిబ్బంది ట్రాక్టర్‌లో తరలించారు. హౌసింగ్ బోర్డుకాలనీలో రోడ్లపై పడవేసిన చెత్త, 8వ డివిజన్ అలుగునూరులోని హైదరాబాద్ రోడ్డులోని చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. రేకుర్తిలో చనిపోయిన పంది కళేబరాన్ని తరలించారు. 55వ డివిజన్ మంకమ్మతోటలో వీధులను ఊడ్చి శుభ్రపరిచారు.11వ డివిజన్ కట్టరాంపూర్ తులసినగర్‌లోని పొదలను తొలగించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి గంటల్లో పరిష్కరించిన కమిషనర్‌కు నగరవాసులు కృతజ్ఞతలు తెలిపారు.