
మంత్రికి వినతిపత్రం ఇస్తున్న కేబుల్ ఆపరేటర్లు
కరీంనగర్‌రూరల్: సీఎం కేసీఆర్ వరంగల్ సభలో ఇచ్చిన హామీ మేరకు కరెంట్‌పోల్ టాక్స్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జిల్లా గ్రామీణ కేబుల్ టీవీ ఆపరేటర్ అసోసియోషన్ కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. గురువారం కరీంనగర్‌లో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సమావేశమై ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి పోల్‌టాక్స్ రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్ల నుంచి కేబుల్ టీవీ ఆపరేటర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, పోల్‌టాక్స్ వసూళ్లతో అదనపు భారం పడుతుందని వివరించారు. సీఎం కేసీఆర్ వరంగల్ సభలో పోల్‌టాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ విద్యుత్ అధికారులు బలవంతంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. సీఎండీతో మాట్లాడి పోల్‌టాక్స్ సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చిన ట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుర్ర తిరుపతి, ఎస్.సత్యనారాయణ తెలిపారు.