‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం’ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం’

Jul 3 2026 2:10 AM | Updated on Jul 3 2026 2:10 AM

‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం’ నేడు సంకష్టహర చతుర్థి

దోమకొండ: ఉపాధ్యాయుల సమస్యల పరిఽష్కారంలో పీఆర్‌టీయూ ముందంజలో ఉంటుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి అన్నారు. గురువారం దోమకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం ప్రభుత్వంతో పోరాడుతూ వారి సమస్యలను సంఘం ఆధ్వర్యంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలో అత్యంత ఎక్కువ సభ్యత్వ నమోదు జరిగేలా చూడాలని సంఘం జిల్లా మండల బాధ్యులకు ఆయన సూచించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కుషాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్‌రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు పన్యాల శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోడ రాజేంద్ర ప్రసాద్‌, రాష్ట్ర బాధ్యులు జశ్వంత్‌, మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి శ్రీసంకష్టహర మహాగణపతి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిజ జ్యేష్టమాస సంకష్టహర చతుర్థి నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు అంజయ్య, రవీందర్‌గౌడ్‌లు తెలిపారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement