ఇసుక టిప్పర్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఇసుక టిప్పర్ల పట్టివేత

Jul 3 2026 2:10 AM | Updated on Jul 3 2026 2:10 AM

ఇసుక టిప్పర్ల పట్టివేత

బిచ్కుంద(జుక్కల్‌): మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను బుధవారం రాత్రి మండలంలోని బండారెంజల్‌ గ్రామస్తులు అడ్డుకొ ని పొలీసులకు అప్పగించారు. గుండెనెమ్లి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమా చారం మేరకు యువకులు, గ్రామస్తులు రోడ్డుపై అడ్డంగా కూర్చొని టిప్పర్లను అడ్డుకున్నారు. బండారెంజల్‌ గ్రామానికి ఆనుకొని ఉన్న మంజీరా నది నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తీసుకెళ్లడానికి రెవెన్యూ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. ట్రాక్టర్లను పట్టుకొని జరిమానా విధిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి ఇసుక రవాణాకు టిప్పర్లకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు టిప్పర్లను పట్టుకొని బిచ్కుంద ఎస్సై రాజుకు సమాచారం అందించారు. సిబ్బందితో వెళ్లి టిప్పర్లను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశామని ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ అనుమతి వేబిల్లుతో మూడు టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నామని టిప్పర్‌ యజమానులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement