మాచారెడ్డి: లచ్చాపేట పాఠశాలలో గురువారం సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ అధికారిణి మమత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాఠశాల సమగ్ర తనిఖీలో భాగంగా ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో పాటు ప్రధానోపాధ్యాయులను ప్రశ్నించారు. అలాగే విద్యార్థుల నుంచి పలు అంశాలతో కూడిన నివేదికను తయారు చేశారు. పాఠశాల నిర్వహణ పాఠ్యాంశాల బోధన మొదలగు అంశాలపై ఆరా తీసిన అధికారిణి హెచ్‌ఎం, సిబ్బందిని ప్రశంసించారు. గ్రామ సర్పంచ్ జూకంటి శ్రీనివాస్ రెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ భవాని, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చంద్రమౌళి, హెచ్‌ఎం రాజేశ్వరరెడ్డి ఉన్నారు.


