భిక్కనూరు: రామేశ్వర్‌పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీరామాలయం నిర్మాణానికి పారిశ్రామికవేత్త గన్నవరం చంద్రమౌళీశ్వరెడ్డి రూ.5 లక్షలను గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో రామాలయం ఉండాలని అన్నారు. రాముడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం దాతను శాలువా, మెమెంటోతో సత్కరించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్‌రెడ్డి, సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్‌కుమార్‌గౌడ్, నేతలు నాగార్తి రమేష్‌రెడ్డి, శంకరప్ప, కందాడి బాల్‌రెడ్డి, సందుగారి రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎర్రకుంటతండాలో జగదాంబమాత, సేవాలాల్ మహారాజ్ ఆలయాల నిర్మాణానికి గురువారం తండావాసులు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పేరుపల్లి సాయిబాబా పాల్గొని పూజలు చేశారు. ఆలయాల నిర్మాణాల్లో తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన చెప్పారు. బెజుగంచెరువుతండా సర్పంచ్ భాస్కర్, ఉపసర్పంచ్ పీక్లానాయక్, మెల్లకుంటతండా సర్పంచ్ బాల్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్(జుక్కల్): టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిన ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమానికి తరలివెళ్తున్న తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) నాయకులను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమానికి వెళ్తున్న మండలంలోని లచ్చన్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మీరేవార్ సాయిలును మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్‌లతో టీఆర్‌ఎస్ నాయకులను ఆపలేరని ఆయన అన్నారు.
మద్నూర్(జుక్కల్): మద్నూర్ మాజీ సర్పంచ్ రౌత్‌వార్ వేద్ ప్రకాష్ పటేల్(75) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేద్ ప్రకాష్ పటేల్ మద్నూర్ సర్పంచ్‌గా రెండు సార్లు పని చేశారు. మద్నూర్ గ్రామ అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. శనివారం మద్నూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారని బంధువులు తెలిపారు.


