బాన్సువాడ : వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు పిల్లలు ఆసక్తి చూపుతారు. కానీ, బాన్సువాడకు చెందిన ఈ చిన్నారులు మాత్రం కర్రసాములో మెలకువలు నేర్చుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. ఫలితంగా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, ఆత్మస్థైర్యాన్ని పొందుతున్నారు. పిల్లలు సెలవులను వృథా చేయకుండా ఆత్మరక్షణకు తోడ్పడేలా వేద్ ఆర్యన్ అనే యువకుడు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే, కర్రసాము, యోగాపై శిక్షణనిస్తున్నారు. తొలుత 12 మంది మాత్రమే రాగా ప్రస్తుతం 40 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడయ్యింది.
ఆర్యసమాజ్ ప్రాంగణంలో కరాటే మాస్టర్ వేద్ ఆర్యన్ (బ్లాక్ బెల్ట్) ఆధ్వర్యంలో కర్రసాము, కరాటే, యోగాపై ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణనిస్తున్నారు.
కరాటే, యోగా శిక్షణతో చిన్నారులలో ఉత్సాహం
మానసిక ఉత్తేజం, శారీరక దృఢత్వం
బాన్సువాడ ఆర్యసమాజ్ ప్రాంగణంలో ఉచిత శిక్షణ


