లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం కార్మికులు ఎంపీడీవో నరేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల మండల అధ్యక్షుడు దత్తురాం మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస వేతనాలు నెలకు రూ.26 వేలు అమలు చేయాలన్నారు. గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు అకౌంట్‌లో జమచేయాలన్నారు. కార్మికులు చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులను నియమించాలన్నారు. జీవో–51ని సవరణ చేసి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్, బిల్ కలెక్టర్‌లకు స్టేటస్ కల్పించాలని, కార్మికులు మరణిస్తే రూ.20 లక్షలు పరిహారం అందివ్వాలని, ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని డిమాండు చేశారు.


