తాడ్వాయి(ఎల్లారెడ్డి): మక్కలను వేగంగా కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ ఇన్‌చార్జి డీఎం క్రాంతి అన్నా రు. ఆమె సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలో కొనసాగుతున్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వచ్చిన మక్కలను వెంట, వెంటనే తూకం చేయాలన్నారు. ఒక వేళ వర్షం కురిస్తే రైతులు ఇబ్బందులను ఎదుర్కోవలసి వ స్తుందన్నారు. తూకం వేసిన బస్తాలను సొసైటీ నిర్వాహకులు వర్షాల నుంచి భద్రపరుచుకోవాలన్నారు. లారీలు తెప్పించి, గన్నీ బ్యాగులు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ కపిల్‌రెడ్డి.. మార్క్‌ఫెడ్ అధికారిని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, డెరెక్టర్ రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.


