మరకత ఆత్మలింగేశ్వరాలయ నూతన కమిటీ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

మరకత ఆత్మలింగేశ్వరాలయ నూతన కమిటీ ఏర్పాటు

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

మరకత ఆత్మలింగేశ్వరాలయ నూతన కమిటీ ఏర్పాటు రోడ్డు పనులు పూర్తి చేయాలి డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఒకే రోజు 87 మందికి శిక్షలు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నజీముద్దీన్‌ కీబోర్డ్‌ వాయిస్తూ.. గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టారు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మకూర్‌లో ఇటీవల నిర్మించిన మరకత ఆత్మలింగేశ్వరాలయ నూత న కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా కుంట రాఘవరెడ్డి, వైస్‌చైర్మన్‌గా బాల్‌రెడ్డి, కార్యదర్శిగా రాజేశ్వర్‌రెడ్డి, కోశాధికారిగా రామాగౌడ్‌, ఆడిటర్‌గా ఉత్తమ్‌ రెడ్డి, సలహాదారుగా నారాయణరెడ్డి, సభ్యులుగా రమేష్‌, వసంత్‌రెడ్డి, మధు, ఈశ్వర్‌, సుదర్శన్‌, ఈశ్వరయ్య, పలంచ, నాగరాజు, సుభాన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిని నియమించారు. ఆలయ అభివృద్ధికి అన్నివిధాల కృషి చే స్తామని ఆలయకమిటీ సభ్యులు పేర్నొన్నారు.

దోమకొండ: మండల కేంద్రం నుంచి ముత్యంపేట వరకు డబుల్‌ రోడ్డు బీటీ పనులు జరుగుతుండగా, ఆ పనులు మూడేళ్ల నుంచి అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం దోమకొండ సర్పంచ్‌ ఐరేని నర్సయ్య ప్రజావాణిలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ స్వప్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముత్యంపేట వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డుపై కంకర పోసి వదిలేశారన్నారు. దీంతో వాహనదారుల తీవ్ర అవస్థలు పడుతున్నారని, వాహనలు దెబ్బతింటున్నాయని తెలిపారు. వెంటనే కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించకోతే కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తానని తెలిపారు. వార్డు సభ్యులు బత్తిని సిద్దరాములు, కటికె శ్రీనివాస్‌, నాయకులు నేతుల మల్లేశం, జనార్దన్‌, తదితరులున్నారు.

కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు న డిపినందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కో ర్టులు సోమవారం ఒకే రోజు 87 మందికి శిక్ష లు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా ఒకరికి 3, 10 మందికి 2, ఇద్దరికి ఒక రోజు జైలు శిక్షతో పాటు మొత్తం 87 మందికి రూ.99 వేలు జరిమానాలను విధించినట్లు ఎస్పీ రాజే ష్‌ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

భిక్కనూరు: మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా సోమవారం నజీముద్దీన్‌ పదవీ బాధ్యతలు తీ సుకున్నారు. ఇంతకుముందు మండల రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన బాలయ్యకు ప్ర భుత్వం పదోన్నతి కల్పిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రానికి బదిలీ చేసింది. ఆయన స్థానంలో మండల రెవిన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న నజీముద్దీన్కు పదోన్నతి కల్పించారు.

కామారెడ్డి టౌన్‌ : జి ల్లాకు చెందిన ఇద్దరు అ న్నదమ్ములు అంతర్జాతీ య స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించారు. జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న చింతల అలెగ్జాండర్‌ కుమారులు చింతల జాన్‌ ఆరోక్‌ (10), చింతల జాన్‌ ఆరోన్‌ (7)తమ అద్భుత సంగీత ప్రతిభతో ఈ ఘనత సాధించారు. హై దరాబాదుకు చెందిన ప్రముఖ సంగీత సంస్థ ‘హల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌’ వ్యవస్థాపకులు పా స్టర్‌ అగస్టిన్‌ దండింగి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధుల సమక్షంలో అంతర్జాతీయ స్థాయి కీబోర్డ్‌ సంగీ త ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి సుమారు 2 వేల మందికి పైగా కీబోర్డ్‌ వాయిద్యకారులు పా ల్గొని ఎడతెరిపి లేకుండా గంటపాటు అద్భుతమైన స్వరాలు పలికించారు. అందులో అత్యంత ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థుల ను మాత్రమే గిన్నిస్‌ రికార్డుకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని జూన్‌ 1న హైదరాబాద్‌లో ‘అచీవర్స్‌ మీట్‌’ నిర్వహించా రు. సంస్థ వ్యవస్థాపకులు దండింగి చేతుల మీ దుగా ఆరోక్‌, ఆరోన్‌లు గిన్నిస్‌ రికార్డ్‌ ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement