తెలంగాణ కోసం 41 రోజులు జైల్లో ఉన్నా.. | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ కోసం 41 రోజులు జైల్లో ఉన్నా..

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

లింగంపేట(ఎల్లారెడ్డి) : ముస్తాపూర్‌ గ్రామానికి చెందిన నారాయణ తెలంగాణ సాధనలో భాగంగా చే సిన ఉద్యమంలో అరైస్టె 41 రోజులు జైల్లో గడి పారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడు తూ..‘‘ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు ఏబీవీపీలో పనిచేశా.. ప్రస్తుతం కామారెడ్డి కోర్టులో న్యాయవాదిగా ప నిచేస్తున్నాను. పదేళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. 2010లో తెలంగాణ యూనివర్సిటీలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండు చేయడంతో పా టు లాఠీ దెబ్బలు తిన్నా. అలాగే రైల్‌ రోకోలో భా గంగా ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి 9 రో జులు జైల్లో పెట్టారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను సంగారెడ్డిలో అడ్డుకున్నాం. పో లీసులు అరెస్టు చేసి 32 రోజులు జైల్లో నిర్బంధించా రు. తెలంగాణ కోసం వంటా వార్పు, రాస్తారోకో లు, నిరసనలు చేసి పలుమార్లు జైలు జీవితం గడిపాం. చివరికి తెలంగాణ సాధించామని తృప్తి ప డ్డాం. కాని ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు. యువతకు ఉద్యోగాలు రాలేదు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా సమైక్యవాదుల నుంచి విము క్తి దొరికింది’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement