● కాంగ్రెస్ నాయకులకు
బీఆర్‌ఎస్ నాయకుల సవాల్
ఎల్లారెడ్డి/లింగంపేట: కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కుప్పలే లేవని, వెనువెంటనే కొనుగోళ్లు జరుగుతున్నాయని అంటున్న కాంగ్రెస్ నాయకులు తమ వెంట కొనుగోలు కేంద్రాలకు రావాలని బీఆర్‌ఎస్ నాయకులు సవాల్ చేశారు. సోమవారం వారు ఎల్లారెడ్డి, లింగంపేట మండల కేంద్రాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును మాజీ ఎమ్మెల్యేను ఎక్కడా దూషించలేదన్నారు. కేవలం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించాలని సూచించినట్లు తెలిపారు. యాసంగి సీజన్ పూర్తయి రెండు నెలలు కావస్తున్నా ఇంకా రైతుల ధాన్యం కల్లాల్లోనే మూలుగుతున్నదన్నారు. రైతుల గోసను ప్రత్యక్షంగా చూయించినట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్, బీఆర్‌ఎస్ నాయకులు గంగారెడ్డి, ఇమ్రాన్, బర్కత్, యూనుస్, లింగంపేటలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, నరేష్, సత్యం, బండి నర్సింలు, గన్నూనాయక్, తదితరులు పాల్గొన్నారు.


