ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

ప్రజావాణికి 105 వినతులు

కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 105 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్‌ కార్డులు, పింఛన్‌లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలు దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. ప్రజల సౌకర్యార్ధం డివిజన్‌ కేంద్రాల్లో కూడా ప్రజావాణి కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. సమస్యలను పరిష్కరించాలి లేదా పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, కలెక్టరేట్‌ పాలనాధికారి మసూర్‌ అహ్మద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement