ఈహెచ్‌ఎస్‌ పేరిట వేతనాల్లో కోత! | - | Sakshi
Sakshi News home page

ఈహెచ్‌ఎస్‌ పేరిట వేతనాల్లో కోత!

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

అసంబద్ధ నిర్ణయం..

కామారెడ్డి టౌన్‌ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) కోసం ప్రభుత్వం మే నెల వేతనాల నుంచి 1.5 శాతం మేర కోత విధించింది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్‌ స్కీమ్‌కు కనీస విధివిధానాలు రూపొందించకుండా, ముందస్తు సమాచారం లేకుండా వేతనాల్లోంచి ఎలా కోత పెడతారని ప్రశ్నిస్తున్నారు.

స్పష్టత కరువు..

ప్రభుత్వం ఈహెచ్‌ఎస్‌ కంట్రిబ్యూషన్‌ కోసం ఉద్యోగుల జీతాల నుంచి 1.5 శాతం డబ్బులు మినహాయించింది. అయితే హెల్త్‌ స్కీమ్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలోని ఏ ఏ ఆస్పత్రుల్లో ఈ ఆరోగ్య పథకం వర్తిస్తుంది? ఉచిత వైద్యం ఎలా అందిస్తారు? అనే విషయాలపై స్పష్టత లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన సందర్భాల్లో, తల్లిదండ్రులతోపాటు పిల్లలు ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల్లో ఈ 1.5 శాతం మినహాయింపులు ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నిస్తున్నారు. డ్రాయింగ్‌ అధికారులకు సైతం సమాచారం ఇవ్వకుండా, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమ్మతి తీసుకోకుండా ఇలా జీతాలు కట్‌ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటోంది. హెల్త్‌ కార్డులు జారీ చేయకుండా, అసలు ఏ హాస్పిటల్‌లో వైద్యం అందుతుందో చెప్పకుండా హెల్త్‌స్కీం కోసం వేతనాలు కోత విధించడం సరికాదు. ఉపాధ్యాయుల సమ్మతి లేకుండా కట్‌ చేసిన సొమ్మును వెంటనే వారి అకౌంట్లకు జమ చేయాలి.

– కొంగల వెంకటి, రాష్ట్ర అధ్యక్షుడు,

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం

మండిపడుతున్న ఉద్యోగ,

ఉపాధ్యాయ వర్గాలు

సమాచారం ఇవ్వకుండా

కట్‌ చేయడంపై ఆగ్రహం

వెంటనే అకౌంట్లలో

జమ చేయాలని డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement