పిట్లం: చిన్నకొడప్‌గల్ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఒకేసారి అగ్నివీర్‌కు ఎంపికయ్యారు. గ్రామ జనాభా సుమారు 3 వేలు. గ్రామానికి చెందిన శివకుమార్, వికాస్ గౌడ్, అరవింద్, మహ్మద్ ఒమన్, హన్మండ్లు ఒకేసారి అగ్నివీర్‌కు ఎంపికవడం గమనార్హం. అరవింద్, హన్మండ్లు తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటుండగా.. శివకుమార్ తండ్రి టైర్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నారు. వికాస్ గౌడ్ తండ్రి రేషన్ డీలర్ కాగా మహ్మద్ ఒమన్ తండ్రి అటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన ఐదుగురు అగ్నివీర్‌కు ఎంపికవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి కృషి, పట్టుదలకు ప్రతిఫలం దక్కిందంటూ అభినందిస్తున్నారు.


