ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ఏర్పడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం, వారిలోని సృజనకళను ప్రోత్సహించడానికి కవితా కార్యశాలలు, కథాకార్యశాలలను నిర్వహించాం. విద్యార్థులు రాసిన రచనలను వివిధ పత్రికలు, పోటీలకు పంపించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి బహుమతులు వచ్చేందుకు కృషి చేశాం. తెలంగాణ సారస్వత పరిషత్, తెలంగాణ సాహిత్య అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా విద్యార్థులు బహుమతులు పొందారు.
– డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక, అధ్యక్షుడు


