● ఘాతుకానికి పాల్పడిన
తండ్రీకొడుకుల రిమాండ్
● వివరాలు వెల్లడించిన
డీఎస్పీ మధుసూదన్
కామారెడ్డి క్రైం : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి హత్య భూ తగాదాల నేపథ్యంలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన మంచాల ఎల్లయ్య, అతని కొడు కు ప్రణీత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఎల్లయ్యకు చెందిన 21 గుంటల భూమిని గతంలో రాజిరెడ్డి రూ.1.20 కోట్లకు ఒప్పందం చేసుకొని కొనుగోలు చేశాడు. అందుకు రూ.28 లక్షలు రాజిరెడ్డి చెల్లించాడు. ఆ డబ్బులలో నుంచి రూ.20 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లోని రాజిరెడ్డి సమీప బంధువులకు చెందిన 2 ఎకరాల భూమిని ఎల్లయ్య రూ.40 లక్షలకు కొనుగోలు చేశాడు. రాజిరెడ్డి మిగితా డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఎల్లయ్య కూడా తాను కొనుగోలు చేసిన భూమికి డబ్బులు చెల్లించలేదు. కొనడం, అమ్మడం రెండూ పూర్తిస్థాయిలో జరుగక గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెంచుకున్న ఎల్లయ్య, అతని కుమారుడు ప్రణీత్... రాజిరెడ్డి హత్యకు పథకం వేశారు. ఈ నెల 29న సాయంత్రం రాజిరెడ్డిని మాట్లాడేందుకు రమ్మని తమ ఇంటి వెనుక పశువుల కొట్టం వద్దకు పిలిచారు. రాజిరెడ్డి రాగానే ఎల్లయ్య వెనుక నుంచి మెడపై రాడ్డుతో బలంగా కొట్టాడు. ఇద్దరూ కలిసి కిందపడిన రాజిరెడ్డి గొంతు నులుమి హత్య చేశారు.ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని భావించి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి గ్రామా నికి సమీపంలోని ఓ పాడుబడిన నీళ్లు లేని బావిలోకి తీసుకువెళ్లి గుంత తీసి పాతిపెట్టారు.రాజిరెడ్డి బైక్‌ను గ్రామానికి దూ రంగా ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో వదిలేశారు. రాజిరెడ్డి కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన అతని కుమారుడు రంజిత్ శనివారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చే శారు. ఎల్లయ్య, ప్రణీత్‌పై అనుమానం ఉందని ఫి ర్యాదులో పేర్కొనడంతో పోలీసులు వారిని విచా రించగా నేరం అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. శనివారం అర్ధరాత్రి మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి అప్పగించామన్నారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సిబ్బందిని అభినందించారు. పట్టణ సీఐ నరహరి, అధికారులు పాల్గొన్నారు.


