ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదు

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

అపూర్వ సమ్మేళనం

నాగిరెడ్డిపేట/లింగంపేట/సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును మాజీ ఎమ్మెల్యే సురేందర్‌పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించడం సరికాదని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట, లింగంపేట, సదాశివనగర్‌ మండల కేంద్రాల్లో ఆదివారం వారు మాట్లాడారు. ఎల్లారెడ్డిలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యేపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల విషయమై ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఇదివరకే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారన్నారు. నియోజకవర్గంలో ధాన్యం గతంలోకంటే ఈ యేడు అధిక దిగుబడులు రావడం వల్ల కొంతమేర జాప్యం జరుగుతోందన్నారు. రైతుల సంక్షేమం కోసమే నియోజకవర్గంలో మక్కల, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించిన ఘనత ఎమ్మెల్యేదని తెలిపారు. దీంతోపాటు ఎన్నోళ్లుగా మంజీర పరివాహక ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న ముంపు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.2 కోట్ల 8 లక్షల నిధులను మంజూరు చేయించారని వారు పేర్కొన్నారు. సమావేశంలో నాగిరెడ్డిపేట్‌ కాంగ్రెస నేతలు శ్రీనివాస్‌రెడ్డి, ఇమామ్‌, నాగిరెడ్డిపేట సర్పంచ్‌ వెంకట్‌, నాయకులు సుధాకర్‌, సాయికుమార్‌, గులాం, సాయాగౌడ్‌, నారాయణరెడ్డి, లింగంపేట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్‌, సర్పంచ్‌ కౌడ రవీందర్‌, ఉపసర్పంచ్‌ ప్రసాద్‌గౌడ్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సక్రూనాయక్‌, శెట్పల్లి సర్పంచ్‌ అట్టెం శ్రీనివాస్‌, ఎల్లమయ్య, దేవేందర్‌రెడ్డి, పూల్‌సింగ్‌, అర్షద్‌, బాలకిషన్‌, కాశీరాం, ఏగొండ, సదాశివనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్‌ రెడ్డి, సీడీసీ చైర్మన్‌ ఇర్షాదొద్దిన్‌, మాజీ వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి వాణి విద్యాలయం ఉన్నత పాఠశాల 2000–01 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉల్లాసంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థుల సందడి చేశారు. 25 ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement