ఊపిరి పోశారు.. | - | Sakshi
Sakshi News home page

ఊపిరి పోశారు..

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

కామారెడ్డి టౌన్‌ : నెలలు నిండకుండా పుట్టి, శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవజాత శిశువుకు 108 అంబులెన్స్‌ సిబ్బంది పునర్జన్మనిచ్చారు. కృత్రిమ శ్వాస అందిస్తూ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన మానస అనే గర్భిణికి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సాధారణ ప్రసవమైంది. అయితే, నెలలు నిండకుండానే మగ శిశు వు జన్మించాడు. పుట్టి న సమయంలో బా బు ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ నిర్జీవ స్థితికి చేరుకోవడంతో పిల్లల వైద్యులు బా బును సాధారణ స్థితి కి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించా రు. ఫలితం లేకపోవడంతో, మెరుగైన చికి త్స కోసం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. 108 అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే శిశువును నిజామాబాద్‌ తరలించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో బాబు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో ఈఎంటీ కృష్ణస్వామి సమయస్ఫూర్తితో అంబులెన్స్‌లోనే నిరంతరాయంగా ఆక్సిజన్‌తోపాటు అంబుబ్యాగ్‌ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, ఐవీ ఫ్ల్యూడ్స్‌ ఇస్తూ బాబును సురక్షితంగా ఇంక్యుబేటర్‌లో ఉంచారు. పైలట్‌ సుదర్శన్‌ గౌడ్‌ సమయస్ఫూర్తితో వాహనాన్ని నడిపి సురక్షితంగా నిజామాబాద్‌ ఆస్పత్రికి చేర్చారు. బాబుకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమయానికి స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడిన 108 ఈఎంటీ కృష్ణస్వామి, పైలట్‌ సుదర్శన్‌ గౌడ్‌ను శిశువు తండ్రి సంతోష్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సైతం అభినందించారు.

108 సిబ్బంది సమయస్ఫూర్తి..

శిశువుకు పునర్జన్మ

నెలలు నిండకుండా పుట్టిన బాబు

కృత్రిమ శ్వాసనందిస్తూ ఆస్పత్రికి తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement