యూఎస్టీ కార్పొరేట్‌ సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

యూఎస్టీ కార్పొరేట్‌ సేవలు అభినందనీయం

May 31 2026 2:00 AM | Updated on May 31 2026 2:00 AM

కామారెడ్డి అర్బన్‌: జిల్లాలో గతేడాది వరద సహాయక కార్యక్రమాల్లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద విశేష సేవలందించిన హైదరాబాద్‌కు చెందిన యూఎస్టీ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రతినిధులను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ శనివారం అభినందించారు. యూఎస్టీ సంస్థ మానవతా సహాయం కింద 600 డిజాస్టర్‌ ఫ్లడ్‌ రిలీఫ్‌ కిట్లను సకాలంలో అందించినట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు. విద్య, వైద్యం, డిజిటల్‌, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. యూఎస్టీ అంబాసిడర్‌ తిరుమల విజయ్‌కుమార్‌, వలంటీర్‌ బృందం సభ్యులు రాధిక పెరుమాల్‌, షాహుల్‌ సయ్యద్‌, టీ.సురేంద్రనాథ్‌, ఎండ్ల భిక్షపతి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement