మోపాల్: మాజీ మంత్రి, సీనియర్ నాయకులు శనిగరం సంతోష్‌రెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి (వాసుబాబు)ని శనివారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి చంద్రశేఖర్ గౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. సంతోష్‌రెడ్డి సతీమణి విజయారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబీకులను ఇరువురు ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా సంతోష్‌రెడ్డి ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో పీజీ సెంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూ ర్వ విద్యార్థులు (1999–2001) సిల్వర్ జూబ్లీ సమ్మేళనం శనివారం నిర్వహించుకున్నారు. పీజీ సెంటర్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీని అభ్యసించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 22 మంది విద్యార్థులు ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆనాటి బ్యాచ్ విద్యార్థులు అందరూ ఉన్నత స్థానాల్లో ఉండటం హర్షణీయమని ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, బాలుర హాస్టల్ వార్డెన్ యాలాద్రి అన్నారు. వీరందరూ ఫార్మ, ఇతర వ్యాపార రంగాలలో దేశ విదేశాల్లో స్థిరపడటం ఎంతో గర్వకారణమన్నారు. పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు ఎంబీ.లక్ష్మణ్, పి.రాజు తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి: మండలంలో ఇందిరమ్మ ఇళ్లు, సొంత నిర్మించుకునే వారికి ఇసుక, మొరం తరలింపునకు అనుమతి లేక ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోతున్నాయని శనివారం తహసీల్దార్ ఉమాలత, ఎస్సై రాజశేఖర్‌కు బీజేపీ నేతలు విన్నవించారు. ఈ మేరకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. బీజేపీ మండల అధ్యక్షుడు నోముల సందీప్ మాట్లాడుతూ.. మండలంలో ఇందిరమ్మ గృహాలు, సొంతంగా కట్టుకునే ఇళ్లకు ఇసుక, మొరం తెచ్చుకుంటే పోలీసులు పట్టుకుంటున్నారని ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇసుక మొరం తిప్పలు తప్పడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు నోముల సందీప్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఇసాయిపేట నరేష్ పాల్గొన్నారు.


