ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

May 31 2026 2:00 AM | Updated on May 31 2026 2:00 AM

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనుల పరిశీలన

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కా ర్యాలయం ముందు తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సీఐటీయూ 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాజనర్సు యూనియన్‌ జెండాను ఆవి ష్కరించారు. రాజనర్సు మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్మికులందరినీ తక్షణమే పర్మినంట్‌ చేయాలని, ఆలోపు కనీస వేతనం రూ.26 వేలు, స్కిల్డ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల్లో గా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.నాయకులు దీవెన, ప్రభాకర్‌, రాజు, లక్ష్మి, శివ, రాజవ్వ, కాట్రాల ప్రభు పాల్గొన్నారు.

దోమకొండ: మండల కేంద్రంలోని బీబీపేట రోడ్డులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్‌ ఐరేని నర్సయ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నరసయ్య మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి బీబీపేట రోడ్డులో మురుగునీరు రోడ్డుపైకి వస్తుండంతో ప్రజలు కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దోమలు, పందులు, కుక్కలు మురికి కాలువలో స్వైర విహారం చేస్తున్నాయని, ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని ఆర్‌అండ్‌బీ డీఈ వినోద్‌, ఏఈ రవితేజలతో కలిసి డ్రైనేజీ పనులు పరిశీలించారు. రూ.8 లక్షలతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించి నీరు బయటకు కనపడకుండా నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement