రైతులు తొందరపడొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు తొందరపడొద్దు

May 31 2026 1:48 AM | Updated on May 31 2026 1:48 AM

న్యూస్‌రీల్‌

ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉంది

వర్షాలు కురిసిన తరువాతే విత్తనాలు వేయాలి

ఎరువులు, విత్తనాల కొరత లేదు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి

– 9లో u

ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026

– 8లో u

కామారెడ్డి క్రైం : రైతులు ఖరీఫ్‌ సాగు పనులకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డిని ‘సాక్షి’ శనివారం ఇంటర్వ్యూ చేసింది. వాతావరణ పరిస్థితులు, ఎరువులు, విత్తనాలు తదితర అంశాలపై మాట్లాడిన డీఏవో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇంటర్వ్యూ సాగిందిలా..

సాక్షి : ఈ ఏడాది వర్షంపాత పరిస్థితులు ఎలా ఉంటాయి..

డీఏవో : సాధారణం కన్నా కొంత తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని భావిస్తున్నాం. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ద్వారా తెలుస్తోంది. జిల్లాపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో చెప్పలేం.

● వర్షాలు ఆలస్యమైతే..

● ప్రాజెక్టులు, చెరువుల, బోర్లు వంటి సాగునీటి వ సతి ఉన్న రైతులు ఎప్పటిలాగే నారుమడులు వేసుకోవచ్చు. జులై చివరి వరకు సోయా, మొక్కజొన్న, పత్తి వంటి వర్షాధారిత పంటలు సాగు చేసుకునే అ వకాశం ఉంటుంది. సకాలంలో, సమృద్ధిగా వర్షాలు కురవకపోతే రైతులు తక్కువ నీటితో సాగయ్యే మాగిజొన్న, ఆముదాలు, ఉలవలు లాంటి పంటల వైపు వెళ్లాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకపోవచ్చు.

● సాగు నీటి కొరత ఎదురైతే భూమిలో తేమశాతం ఉండేలా ఏం చేయాలి..

● భూమిలో కర్భన శాతం సమృద్ధిగా ఉంటే తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అందుకోసం పచ్చిరొట్ట ఎరువు, పశు పేడ వంటి సేంద్రియ ఎరువులు వేసుకోవాలి.

● గతేడాది యూరియా సకాలంలో అందక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు కదా..

● జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదు. యూరియా తప్ప అన్ని రకాల ఎరువులు దుకాణాలు, సింగిల్‌ విండోల్లో సిద్ధంగా ఉన్నాయి. యూరియా బుకింగ్‌ యాప్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఎప్పటికప్పుడు ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం.

● సేంద్రియ వ్యవ సాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు..

● ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాం. జిల్లాలో ని 15 క్లస్టర్‌లలో క్లస్టర్‌కు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామానికి 125 మంది రైతులకు గాను 125 ఎకరాల భూమిని గుర్తించాం. గ్రామానికో కృషి సఖి అనే వలంటీర్లను నియమించాం. ఎంపిక చేసిన రైతులు, కృషిసఖిలకు శిక్షణ ఇచ్చాం. సేంద్రియ పద్ధతిలో ఈ ఖరీఫ్‌ నుంచే పంటల సాగు చేపట్టబోతున్నాం.

● భూసార పరీక్షలు చాలా తక్కువ మంది రైతులు చేయిస్తున్నారు..

● జిల్లాలోని 407 రెవెన్యూ గ్రామాల్లో గ్రామానికి 3 చొప్పున మట్టి శాంపిళ్లను తీయించి ల్యాబ్‌కు పంపించాం. అలాగే బీబీపేట మండలంలో పూర్తి స్థాయిలో మట్టి శాంపిళ్లను సేకరించాం. మొత్తం 6,100 శాంపిళ్ల ఫలితాలు వచ్చాయి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా వాడాల్సిన ఎరువులు, ఎటువంటి పంటలు సాగు చేస్తే బాగుంటుందనే అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

● ‘నిగ్రాని సమితి’ల పనితీరుపై విమర్శలు..

● సర్పంచ్‌, జీపీ కార్యదర్శి, సీనియర్‌ రైతులతో ఈ సమితిలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చే శాం. విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతుల అవసరాలు, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడం లేదా వ్యవసాయ అధి కారుల దృష్టికి తీసుకురావడం వంటి ప నులు చేస్తుంటారు. అన్ని గ్రామాల్లోనూ స మితిలు పని చేస్తున్నాయి. ఎలాంటి ఫిర్యా దులు లేవు.

● నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు..

● పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కూడిన జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశాం. ఈ కమిటీలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నకిలీ విత్తనాలు, ఎరువుల లభ్యతపై నిఘా ఉంచుతాయి. క్రమం తప్పకుండా దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

నాట్లు వేయడానికి అనుకూలమైన సమయం..

సకాలంలో వర్షాలు కురిస్తే దీర్ఘకాలిక రకాలకు మే చివరలో, మధ్యస్థ రకాలకు జూన్‌ 15 నుంచి, స్వల్పకాలిక రకాలకు జూలై ప్రారంభంలో నారు మడులు పోసుకుని నారు చేతికి రాగానే నాట్లు వేసుకోవాలి. తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) రకాన్ని మాత్రం కచ్చితంగా జులై ప్రా రంభంలో నారు వేసుకుని నెలాఖరు లోగా నాట్లు వేయాల్సి ఉంటుంది.

యూరియా వినియోగాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు..

నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. మరింతగా రైతుల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేపడుతాం.

‘పంటల సాగు పనుల్లో తొందరవద్దు. వాతావరణ శాఖ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉంది. జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత లేదు. రుతుపవనాల రాక, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్న నేపఽథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పనుల్లో ముందుకు వెళ్లాలి. సాగునీటి వసతులు లేని ప్రాంతాల్లో వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలి. భూసార పరీక్షలు, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.’

– జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement