రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి

May 31 2026 1:48 AM | Updated on May 31 2026 1:48 AM

కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. జిల్లా రహదా రి భద్రతా కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో శనివా రం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. రహదారుల వెంబడి ఉన్న ఆక్రమణలు ప్రమాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో వాటి తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైవేల వెంబడి హోటళ్లు, దాబాలకు అనధికారికంగా ఏ ర్పాటు చేసిన ప్రవేశ మార్గాలను తొలగించాలని ఆ దేశించారు. వన్యప్రాణులు ప్రమాదాలబారిన పడకుండా జాతీయ రహదారుల వెంబడి జంతువుల కోసం అండర్‌పాస్‌ల నిర్మాణాలకు ప్రతిపాదనలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. మల్లుపేట, గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో, మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, షెవ్రాన్‌ మార్కింగ్‌, ఇతర రహదారి భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా కృషి చేయాలన్నారు. సమావేశంలో రవాణా, పోలీస్‌, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల సంస్థ, అటవీ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

రహదారి వీరుల పథకంపై సమీక్ష

రహదారి ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేందుకు ఉద్ధేశించిన రహదారి వీరుల (రహవీర్‌) పథకాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదం జరిగిన వెంటనే తక్షణమే స్పందించి బాధితులకు సాయం చేయాలని, ప్రతి ఒక్కరూ ’రహదారి వీరులు’గా మారాలని పిలుపునిచ్చారు. ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో కాపాడిన వారికి ప్రభుత్వం తరఫున రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూసేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు.

ఆక్రమణల తొలగింపునకు

ప్రత్యేక చర్యలు తీసుకోండి

ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో

హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి

రహదారి భద్రతా కమిటీ సమావేశంలో

కలెక్టర్‌ సంగ్వాన్‌

Advertisement
 
Advertisement
Advertisement