సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

May 31 2026 1:48 AM | Updated on May 31 2026 1:48 AM

అడిషనల్‌ కమిషనర్‌ బదిలీ

బాన్సువాడ : సమ్మర్‌ క్యాంపులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్‌ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో కొనసాగుతున్న సమ్మర్‌ క్యాంప్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో క్రీడకారులకు సమ్మర్‌ క్యాంపులను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడకారులకు విద్య, ఉద్యోగ రంగాల్లో 2 శాతం కోట ద్వారా అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు భవిష్యత్‌లో ఎంతో ఉపయోగకరంగా మారుతాయన్నారు. వాలీబాల్‌ కోచ్‌ సురేందర్‌, క్రికెట్‌ కోచ్‌ నరేశ్‌ తదితరులు ఉన్నారు.

గోదావరి జలాలపై నేడు

రౌండ్‌ టేబుల్‌ సమావేశం

కామారెడ్డి అర్బన్‌: గోదావరి జలసాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కామారెడ్డి కర్షక్‌ బీఎడ్‌ కళాశాలలో నిర్వహించే రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని సమితి నాయకులు కోరారు. సమావేశానికి ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, విదార్థి సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించాలని జలసాధన సమితి జిల్లా కన్వీనర్‌ వై.వెంకటరాంరెడ్డి, న్యాయవాది జగన్నాథం, కాలమిస్ట్‌ వేణుగోపాల్‌ అన్నారు.

ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని

నిలిపి వేయాలి

భిక్కనూరు : మండల కేంద్రం సమీపంలో కొనసాగుతున్న ఫార్మా కంపెనీ నిర్మాణ పను లను నిలిపివేయా లని భిక్కనూరుకు చెందిన యువకుడు కొ జ్జాపూరం వేణు తహసీల్దార్‌ సునీతకు శని వారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలోని శ్రీరాంనగర్‌ కాలనీకి కేవ లం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఫార్మా కంపెనీ నిర్మాణం కొనసాగుతోందని, కంపె నీ ప్రారంభమైతే దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. వెంటనే ని ర్మాణ పనులను నిలిపివేయించాలని కోరారు.

వడదెబ్బతో

వృద్ధుడు మృతి

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని బ్రహ్మణ గల్లీకి చెందిన జంగం నాగ్‌నాథ్‌ అప్పా (58) వడబెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నాగ్‌నాథ్‌ అప్పా దొరికి న పని చేసుకుంటూ ఉండేవాడు. ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి స్పృహతప్పి పడిపోవడంతో కుబుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎంసీ) అదనపు కమిషనర్‌ రవీందర్‌సాగర్‌ మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కా ర్పొరేషన్‌కు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ము న్సిపల్‌ కమిషనర్‌లను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థా నంలో చంద్రశేఖర్‌ గ్రేటర్‌ వరంగల్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌ నుంచి బదిలీపై వస్తున్నా రు. అదే విధంగా సీడీఎంఏ నుంచి డిప్యూటీ కమిషనర్‌గా ఖమర్‌అహ్మద్‌, సెక్రటరీగా పి.వెంకటేశ్‌ బదిలీపై వస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement