ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం

May 31 2026 1:48 AM | Updated on May 31 2026 1:48 AM

రైతుల పక్షాన పోరాడుతాం

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ధాన్యంసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొనుగోలుకేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్‌తోకలిసి మండలంలోని మాల్తుమ్మెద, కన్నారెడ్డి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని కొందరు రైతులు మాజీమంత్రికి చూ యించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ధాన్యంకొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం ధాన్యంకోనుగోళ్లు పూర్తయ్యాయని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తిభిన్నంగా ఉన్నాయన్నారు. మాల్తుమ్మెద నుంచి ఇప్పటి వరకు కేవలం 34 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలించారని, మరో 70 నుంచి 80 లారీలకుపైగా ధాన్యంకుప్పలు ఇంకా కేంద్రంలోనే ఉండిపోయాయ న్నారు. రైతులు రాత్రింబవళ్లు ధాన్యంకుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. రాబోయే రెండురోజుల్లో లారీల సంఖ్యను పెంచి ధాన్యం తరలింపును వేగవంతం చేయకపోతే రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు ప్రతాప్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సిద్ధయ్య, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, గోపాల్‌పేట సర్పంచ్‌ వంశీకృష్ణాగౌడ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement