పాలన చేతకాకపోతే దిగిపోండి | - | Sakshi
Sakshi News home page

పాలన చేతకాకపోతే దిగిపోండి

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

పాలన చేతకాకపోతే దిగిపోండి

మద్నూర్‌: రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలన చేతకాకపోతే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మద్నూర్‌ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్‌ హాల్‌లో జుక్కల్‌ నియోజకవర్గస్థాయి బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు, సర్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడు తూ ఖరీఫ్‌ సమీపిస్తున్నా ఇప్పటికీ పంటల కొనుగోళ్లు పూర్తికాకపోవడం దారుణమన్నారు. పంట కొనుగోళ్లు చేతకాక కేంద్రం మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జొన్న పంటను తక్షణమే కొనాలని, లేకపోతే జుక్కల్‌లో ధర్నా చేసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకునే బాధ్యత బీఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలపై ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నాయకులకు సూచించారు. బూత్‌ లెవల్‌ సభ్యులు ఇంటింటికి తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉందో వివరించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ సభ్యులు సర్‌ సర్వేను పరిశీలించాలని మాజీ ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి వీజీ గౌడ్‌ పార్టీ నాయకులను కోరారు. బోగస్‌, డూప్లికేట్‌ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని, అర్హుల ఓట్లు ఓటరు జాబితాలో ఉండేలా బీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటి సభ్యులు చూడాలని జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌ గుప్తా, నల్లమడుగు సురేందర్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

జొన్నలు కొనకుంటే జుక్కల్‌

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం

మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మద్నూర్‌లో బీఆర్‌ఎస్‌

సభ్యత్వ నమోదు సభ

Advertisement
 
Advertisement
Advertisement