● అర్హులందరికీ ఓటు హక్కు ఉండాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్ : జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫారం–6, ఫారం–7, ఫారం–8ల వినియోగంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ విక్టర్ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ీసీఈవో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, సవరణల ప్రక్రియపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు. కొత్త ఓటరు నమోదు కోసం ఫారం–6, అర్హత లేని లేదా మరణించిన వారి పేర్ల తొలగింపునకు ఫారం–7, ఓటర్ల వివరాలలో తప్పుల సవరణలు, మార్పుల కోసం ఫారం–8ను ఉపయోగించే విధానాన్ని వివరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు అయ్యేలా క్షేత్రస్థాయి అధికారులు చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించిన తొలిదశ ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాకు సంబంధించి పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన జూన్ 1 వరకు కొనసాగుతుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ జిల్లా సమన్వయకర్త విజయ్‌కుమార్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు జూన్ 3 నుంచి 6 వరకు కళాశాలలను ఎంపిక చేసుకోవాలని, 6న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో అధికారులు అజారుద్దీన్, ఫర్హీన్ ఫాతిమా, ఆరె శ్రీలత, పవన్‌కుమార్, రవి, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


