వైభవంగా ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

బాన్సువాడ రూరల్‌: పులికుచ్చతండాలో శుక్రవారం శ్రీసంత్‌సేవాలాల్‌, జగదాంబ ఆలయ వార్షికోత్సవాన్ని తండావాసులు వైభవంగా జరుపుకున్నారు. ఉత్సవానికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. తండావాసులతో కలిసి ఆలయ ప్రాంగణంలో భోగ్‌భండార్‌ నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ యువతీయువకులు డీజే నృత్యాలతో ఆకట్టుకున్నారు. గిరిజన యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఎమ్మెల్యే పోచారంను ఘనంగా సన్మానించారు. గిరిజన నాయకుడు బద్యానాయక్‌, మోహన్‌నాయక్‌, సర్పంచ్‌ అనితా శ్రీనివాస్‌, తండా నాయక్‌ హేమ్లా, కార్యదర్శి విజయ్‌, నాయకులు దుప్యా, దేవిసింగ్‌, చోక్లా, పీర్‌సింగ్‌, వసంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ముత్యాల పోచమ్మకు బోనాలు..

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): కాటేపల్లిలో ముత్యాల పోచమ్మకు శుక్రవారం ఘనంగా బోనాలు కార్యక్రమం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం భక్తులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకొని నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జలాల్‌పూర్‌ జీపీ కార్యాలయం వద్ద శుక్రవారం గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన పైపులైన్‌ ఏర్పాటు కోసం అడిగిన వెంటనే ఎమ్మెల్యే రూ.7.5లక్షలు మంజూరు చేశారని సర్పంచ్‌ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశామని ఆయన చెప్పారు. జీపీ కార్యదర్శి వెంకట్‌రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement