జీవితానికి చదువు ఎంత ముఖ్యమో జీవించడానికి సంస్కారం అంతే ముఖ్యం అంటారు పెద్దలు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం సంస్కారంతోపాటు క్రమశిక్షణ నేర్పుతుందని అంటున్నారు లింగేశ్వరగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్. ఇందుకోసం తమ ఆశ్రమంలో సంస్కృతి బోధన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ రూరల్ : విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడంతోపాటు ఆధ్యాత్మిక చింతన , భగవద్గీత, మహాభారతం , భాగవతం శ్లోకాలను నేర్పేందుకు లింగేశ్వరగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణమహ రాజ్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. మండలంలోని మల్లారం శివారులో ఉన్న ఆశ్రమంలో ఈనెల 26 నుంచి ప్రారంభమైన శిబిరంలో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. శుక్రవారం నాటితో శిబిరం ముగియనుంది. లింగేశ్వర గుట్టపై కొలువుదీరిన శివుని సన్నిధిలో కృష్ణమహరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆధ్యాత్మిక గ్రంథాల్లోని శ్లోకాలను కంఠస్థం చేస్తున్నారు. తల్లిదండ్రుల ను, గురువులను, పెద్దలను గౌరవించడం, దురలవాట్లకు దూ రంగా ఉండడం, సనాత న ధర్మంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
విద్యార్థులకు నిత్యాన్నదానం
ఈనెల 26న ప్రారంభమైన సంస్కృతి బోధన శిబిరం (వేసవి శిక్షణ) శుక్రవారం ముగియనుంది. సుమారు వంద మంది విద్యార్థులకు లింగేశ్వరగుట్ట ఆశ్రమంలోనే వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సంస్కృతి బోధన శిబిరానికి పంపించగా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా పిల్లలు తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చుదిద్దుకుంటున్నారు.
లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో
సంస్కృతి బోధన శిబిరం
సెలవుల్లో ఆధ్యాత్మికతకు,
సంస్కారానికి పెద్దపీట
100 మంది విద్యార్థులకు
ఆశ్రమంలో బోధనలు


