నిజామాబాద్ అర్బన్: ద్విచక్ర వాహనాల చోరీ కి పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చే సినట్లు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి గురువారం తెలిపారు. నగరంలోని కవిత కాంప్లెక్స్ ఎదుట పార్క్ చేసి ఉన్న బైక్ ఇటీవల చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం వాహనాల ను తనిఖీ చేస్తుండగా నామ్‌దేవ్‌వాడకు చెందిన నవీ న్ అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో పట్టుబడ్డాడు. అతడిని విచారించగా, ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్‌లు, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, బాన్సువాడ, పిట్లంలో ఒక్కో బైక్‌ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన బైక్‌లను కామారెడ్డి జిల్లా సోమేశ్వరం గ్రామానికి చెందిన మోహిద్, మోహన్ అనే ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
నిజామాబాద్ రూరల్: రైస్‌మిల్లులో చోరీకి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖానాపూర్ చెందిన పసుపుల మహిపాల్ ఈనెల 27వ తేదీన విఠల్‌గౌడ్‌కు చెందిన పాత రైస్‌మిల్‌లో నుంచి 10హెచ్‌పీ మోటార్‌ను ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి విఠల్‌గౌడ్‌కు సమాచారం అందించగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 10గంటల సమయంలో మద్యం మత్తులో రోడ్డు పక్కన పడుకుని ఉన్న మహిపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి యత్నించానని ఒప్పుకున్నాడు.


