హలో ఫ్రెండ్స్... నా పేరు సాత్విక్. నేను నిజామాబాద్‌లోని విశ్వోదయ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో అమ్మమ్మ కృపారాణి, అన్నయ్యలు వోమన్త్, మిట్టు, అక్కయ్యలు సౌమ్య, సంగీత, పెద్దమ్మ ఉజ్వల, పెద్దనాన్న ప్రేమ్‌సాగర్‌తో కలిసి టూర్‌కు వెళ్లాం. బాపట్ల బీచ్‌లో ఈత కొట్టాము. ఇసుకతో ఆటలు ఆడాం. సముద్రపు ఒడ్డున వాలీబాల్ గేమ్ ఆడటం ఎంతో ఆనందంగా అనిపించింది. అలియర్ రిజర్వ్ ఫారెస్టులో ఏనుగులు, జింకల గుంపులను చూశాం. ఊటీలో టీ తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీలను చూశాం.


