● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్‌పేట్ గ్రామాల్లో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలన్నారు. సర్పంచ్‌లు ఎడ్ల నర్సింలు, షేక్ ఉమర్, మాజీ జెడ్పీటీసీలు రాజేశ్వర్ రావు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.


