ఉత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహం

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

తపన ఉండాలి ఆటపాటలూ ముఖ్యమే.. అనేక విషయాలు నేర్చుకుంటున్నా..

ఈ ఏడాది ఊరికి వెళ్లలేదు

నైపుణ్యాన్ని వెలికితీసేందుకే..

ఉల్లాసం..
మల్లారం పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం

యోగాసాధనలో పోటీ పడుతున్న చిన్నారులు

చెస్‌, క్యారం, పెయింటింగ్‌ అంశాల్లో తర్ఫీదు

● శిబిరంలోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులు

నిజామాబాద్‌ రూరల్‌: ‘వేసవి సెలవులు ఎంజాయ్‌ చేయడానికి కాదు.. వ్యక్తిత్వ వికాసానికి, మనలోని నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఉపయోగపడే విలువైన కాలం’ అని అంటున్నారు మల్లారంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు. పాఠశాలకు సెలవులు ప్రకటించగానే అమ్మమ్మ ఇంటికి, బంధువుల ఇళ్లకు, టూర్లకు వెళ్లిపోకుండా స్థానికంగా తమ పాఠశాలలో ఏ ర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్నారు. హెచ్‌ఎం రామ్మోహన్‌, ఉపాధ్యాయుడు భూమాగౌడ్‌ పర్యవేక్షణలో పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. 78 మంది విద్యార్థులు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. ఈ నెల 13న ప్రారంభమైన వేసవిశిక్షణ తరగతులు 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ఇండోర్‌ గేమ్స్‌కు ప్రాధాన్యం

వేసవి శిక్షణ శిబిరంలో ఇండోర్‌ గేమ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిత్రలేఖనం, క్యారం, చెస్‌, పెయింటింగ్‌, యోగా సాధన చేయడంతోపాటు శ్లోకాలు కంఠస్థం చేస్తున్నారు. విద్యార్థులకు ఆటలతోపాటు మానసిక ఉల్లాసమూ కలుగుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న హెచ్‌ఎం రామ్మోహన్‌ను ఎంఈవో ప్రత్యేకంగా అభినందించారు.

శిక్షణ శిబిరం.. బడిబాట

ఓ వైపు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు.. మరో వైపు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామంలో ‘బడిబాట’ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక మండలి సహకారంతో ఇంటింటికీ వెళ్తున్న ఉపాధ్యాయులు.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు.

యోగా సాధన చేస్తున్న చిన్నారులు

గ్రామ పంచాయతీ సహకారంతో మా టీచర్లు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం.నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుంది. – కోమలి, 9వ తరగతి

చదువుతోపాటు విద్యార్థులకు ఆటపాటలు ఎంతో ముఖ్యం. మా పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. శ్లోకాలు నేర్చుకుంటున్నా.

– అనుదీపిక, 7వ తరగతి

వేసవి శిక్షణలో అనేక అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ పొందుతున్న శిక్షణ భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ తరగతులకు హాజరవుతున్నా. – రమ్య, 8వ తరగతి

వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లేదాన్ని. స్కూల్‌ లో వేసవి శిక్షణ శిబిరం ఏ ర్పాటు చేయడంతో ఊరికి వెళ్లలేదు. యోగా, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, సాధాన చే స్తూ.. ఇండోర్‌ గేమ్స్‌ ఆడుతూ ఉత్సాహంగా గడుపుతున్నా. – స్రవంతి, 9వ తరగతి

విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వేసవి శిక్ష ణ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యాశాఖాధికారు లు పూర్తి సహాయసహకారా లు అందిస్తున్నారు. విద్యార్థులు వేసవి శిక్షణకు ఉత్సాహంగా హాజరవుతుండడం ఆనందాన్నిస్తోంది.

– రామ్మోహన్‌, హెచ్‌ఎం

Advertisement
 
Advertisement
Advertisement